శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి మృతి:
.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర సంతాపం
నర్సీపట్నం నవంబరు 4 మేజర్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి మృతి పట్ల.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మండలి ఛైర్మన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడటంలో చక్రపాణి చేసిన విశేష కృషిని స్పీకర్ కొనియాడారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. చక్రపాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు."