అవోపా శాశ్వత నిధి కింద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలం లోని బత్తలూరు లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు ఎంపీపీ ప్రత్యేక పాఠశాలలో ఆళ్లగడ్డ ఆవోపవారి శాశ్వత సేవానిధి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంగళవారం విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. కీర్తిశేషులు పోలేపల్లి నాగేంద్ర కుమార్ జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు సుబ్బలక్ష్మమ్మ , సత్యనారాయణ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన పలకలు, పెన్నులు, పెన్సిల్ బాక్సులు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు సత్యనారాయణ కన్వీనర్ వెంకటసుబ్బయ్య విద్యానిధి చైర్మన్ కృష్ణమూర్తి సభ్యులు వెంకటేష్ దాత పోలేపల్లి సత్యనారాయణ మరియు పాఠశాల సిబ్బందిపాల్గొన్నారు. ఈ సందర్భంగాదాత పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ స్వగ్రామమైన బత్తలూరులో, తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు తన కుమారుని జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అవోపా సభ్యులకు పాఠశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా