BREAKING
ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం బొంపెల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. - 42 బైక్‌లు, 2 ఆటోలు సీజ్ పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం

తాడిమర్రిలో హోరాహోరీగా తెలుగు తమ్ముళ్ల ప్రచారం.. పసుపుమయమైన మండల కేంద్రం!

Select Suryaa Now
తాడిమర్రిలో హోరాహోరీగా తెలుగు తమ్ముళ్ల ప్రచారం.. పసుపుమయమైన మండల కేంద్రం!

తాడిమర్రి, మేజర్ న్యూస్ :- ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఊరకలేస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారం స్థానికంగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెదేపా నియోజకవర్గ బాధ్యులు పరిటాల శ్రీరామ్ మార్గదర్శనం, ఆదేశాల మేరకు మంగళవారం నాడు తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి సత్తా చాటారు. మండల కేంద్రంలో సాగిన ఈ ప్రచారం అసాధారణ రీతిలో సాగింది. "చీమల పుట్ట పగిలితే చీమలు ఎలా ఉప్పెనలా వస్తాయో" అన్నట్లుగా.. తెదేపా శ్రేణులు, కూటమి కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ హోరుతో తాడిమర్రి మండల కేంద్రమంతా పూర్తిగా పసుపుమయంగా మారిపోయింది. జెండాలు, కేరింతలు, నినాదాలతో రోడ్లు మార్మోగాయి. కూటమి అభ్యర్థుల భారీ విజయమే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం ఈ సందర్భంగా కూటమి తరఫున జడ్పిటిసి బరిలో నిలిచిన అభ్యర్థి రాము, అలాగే ఎంపీటీసీ అభ్యర్థి బిల్లే నారాయణస్వామిల విజయమే ధ్యేయంగా నాయకులు ప్రచారం హోరెత్తించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ, ఓటర్లను స్వయంగా కలుస్తూ.. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటేసి, అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలని అభ్యర్థించారు.  కదంతొక్కిన ప్రముఖ నాయకులు ఈ భారీ ప్రచార కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ కూచి రామ్మోహన్, తెదేపా నాయకులు ముంటిమడుగు హర్షవర్ధన్, ఉమ్మడి జిల్లాల సర్పంచ్ సంఘం మాజీ అధ్యక్షులు గోనుగుంట్ల భూషణ్, భాస్కర్ గౌడ్, అన్నదర విశ్వనాథ్, గడ్డం గోపాల్ రెడ్డి, పక్కీరా రెడ్డి, కుల్లాయి రెడ్డి, నాగేంద్ర, నగేష్, ముంటిమడుగు వినోద్ కుమార్, వైటీ చంద్ర, గణేష్, రంగయ్య తదితర ముఖ్య నేతలు, వందలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తాడిమర్రి మండలంలో తెదేపా చేపట్టిన ఈ ప్రచార జోరు చూస్తుంటే.. ఈ ప్రాంతంలో పార్టీకి ఉన్న పట్టు ఏమాత్రం తగ్గలేదని, పైగా తిరుగులేని ఆధిపత్యం మరోసారి నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జోరు పోలింగ్ రోజున భారీ విజయంగా మారుతుందని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.