BREAKING
దుర్గం చైర్ పర్సన్ గా బుట్నా లక్ష్మి తిమ్మరాజు విజయం. ప్రముఖ లీగల్ సంస్థను నియమించుకున్న మెక్‌డొనాల్డ్స్ బేతంచెర్లలో వైసీపీ జయభేరి మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి నైజీరియా మాజీ గవర్నర్‌కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురు..అవినీతి కేసులో అప్పీలు తిరస్కరణ కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani అరుణాచల్ కివీ పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు..దుబాయ్‌కి తొలి ఎగుమతిని పూర్తిచేసిన అపెడా మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే పశ్చిమాసియా దాడుల్లో 23 మంది భారతీయ పౌరుల మృతి.. విదేశాంగ శాఖ వెల్లడి జోరువానలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి. తెలంగాణను తాకనున్న ‘మురసు’ తుఫాన్: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ధనుస్సు రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఫ్రాన్స్, ఇటలీలలో నిరసనలు..భారతీయ పౌరులు, విద్యార్థులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు

పలాస పుర పీఠం టీడీపీ కైవసం!

Select Suryaa Now
పలాస పుర పీఠం టీడీపీ కైవసం!

పలాస, సూర్య : పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘ సాధారణ ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించింది. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పకడ్బందీ భద్రత నడుమ నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఓటర్లు కూటమి పక్షాన స్పష్టమైన తీర్పునిచ్చారు. పురపాలక చైర్‌పర్సన్‌ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వజ్జ గంగాభవాని 8,845 ఓట్ల తిరుగులేని మెజారిటీతో సొంతం చేసుకున్నారు. ఆమెకు మొత్తం 19,561 ఓట్లు పోలవగా.. సమీప ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాలాసు శ్రీపద్మకు 10,716 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి దువ్వాడ శ్రీజ 2,330 ఓట్లు, మన్యాల రమ్య 513 ఓట్లు, లక్ష్మీ ప్రధాన్ 219 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి బద్రి సీతమ్మ 157 ఓట్లు సాధించగా, నోటాకు 213 ఓట్లు నమోదయ్యాయి.

వార్డుల్లో 31 స్థానాలు కైవసం చేసుకున్న కూటమి:
మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఏకంగా 27 వార్డుల్లో జయకేతనం ఎగురవేయగా.. మిత్రపక్షాలైన జనసేన 3 వార్డుల్లో (1, 10, 12 వార్డులు), భారతీయ జనతా పార్టీ 1 వార్డులో (9వ వార్డు) ఘన విజయాలు నమోదు చేశాయి. దీంతో కూటమి బలం 31కి చేరింది.  వైఎస్సార్‌సీపీ కేవలం 4 వార్డుల్లోనే (2, 18, 21, 35 వార్డులు) విజయం సాధించి నామమాత్రపు స్థానాలకే పరిమితమైంది. 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దువ్వాడ శ్రీకాంత్ విజయం సాధించారు.

35వ వార్డులో టై.. లాటరీతో తేలిన ఫలితం!
కౌంటింగ్‌ ప్రక్రియలో 35వ వార్డు (జనరల్ మహిళ) ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇక్కడ తెదేపా అభ్యర్థి జోగ త్రివేణి, వైకాపా అభ్యర్థి మార్పు అరుణలకు సరిగ్గా చెరో 340 ఓట్లు నమోదయ్యాయి. ఇరువర్గాల సమక్షంలో రీకౌంటింగ్ చేపట్టినా ఫలితంలో మార్పు లేకపోవడంతో.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు లాటరీ (టాస్‌) నిర్వహించారు. లాటరీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్పు అరుణను విజేతగా ప్రకటించారు. మరోవైపు 19వ వార్డులో తెదేపా అభ్యర్థి గోలియా లత 802 ఓట్ల భారీ మెజారిటీ సాధించి రికార్డు సృష్టించగా.. 31వ వార్డులో తెదేపా అభ్యర్థి పట్టా మల్లేష్ కేవలం 19 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ: 36 వార్డుల విజేతలు, ఓట్ల వివరాలు

1వ వార్డు [బీసీ (జనరల్)]: ఓడరేవు అశోక్ (జనసేన - 797 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి దున్న సత్యారావు (615) పై 182 ఓట్లతో గెలుపు.

2వ వార్డు [మహిళ (జనరల్)]: వల్లభ పార్వతి (వైఎస్సార్‌సీపీ - 262 ఓట్లు) సమీప జనసేన అభ్యర్థి పసుపురెడ్డి బేబీ రాణి (232) పై 30 ఓట్లతో గెలుపు.

3వ వార్డు [ఎస్టీ (జనరల్)]: సవర రాంబాబు (తెదేపా - 671 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి సవర సోమేశ్వరరావు (504) పై 167 ఓట్లతో గెలుపు.

4వ వార్డు [ఎస్సీ (మహిళ)]: చెల్లూరు శకుంతల (తెదేపా - 558 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి తెప్ప దమయంతి (201) పై 357 ఓట్లతో గెలుపు.

5వ వార్డు [బీసీ (మహిళ)]: తిరునగరి వెంకటరత్నం (తెదేపా - 699 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి దట్టి సౌందర్య (454) పై 245 ఓట్లతో గెలుపు.

6వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: గంధం కామేశ్వరరావు (తెదేపా - 460 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి పిచ్చుక అజయ్ కుమార్ (416) పై 44 ఓట్లతో గెలుపు.

7వ వార్డు [బీసీ (జనరల్)]: సంపతిరావు సుధాకరరావు (తెదేపా - 583 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి సంపతిరావు జయరాం (258) పై 325 ఓట్లతో గెలుపు.

8వ వార్డు [మహిళ (జనరల్)]: సనపల సుజాత (తెదేపా - 922 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి దువ్వాడ సత్యవతి (300) పై 622 ఓట్లతో గెలుపు.

9వ వార్డు [బీసీ (మహిళ)]: పాలవలస పద్మావతి (భాజపా - 571 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి పి. దివ్య (309) పై 262 ఓట్లతో గెలుపు.

10వ వార్డు [మహిళ (జనరల్)]: పెద్దగోపు జగదాంబ (జనసేన - 500 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి గుజ్జు శైలజ (332) పై 168 ఓట్లతో గెలుపు.

11వ వార్డు [మహిళ (జనరల్)]: సార రోజ (తెదేపా - 364 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి మీసాల సుశోభిత (313) పై 51 ఓట్లతో గెలుపు.

12వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: సర్పవరపు ప్రదీప్ కుమార్ (జనసేన - 383 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి మార్పు యుగంధర్ (308) పై 75 ఓట్లతో గెలుపు.

13వ వార్డు [మహిళ (జనరల్)]: కొత్తకోట కృష్ణవేణి (తెదేపా - 368 ఓట్లు) సమీప స్వతంత్ర అభ్యర్థి ఎన్.లావణ్య (178) పై 190 ఓట్లతో గెలుపు.

14వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: మల్ల కృష్ణారావు (తెదేపా - 555 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బెల్లాల శ్రీనివాసరావు (222) పై 333 ఓట్లతో గెలుపు.

15వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: కొత్త రాజేశ్వరి (తెదేపా - 769 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బోర కృష్ణారావు (514) పై 255 ఓట్లతో గెలుపు.

16వ వార్డు [బీసీ (జనరల్)]: మురపాల నాగరాజు (తెదేపా - 636 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి పోతనపల్లి హరిప్రసాదరావు (457) పై 179 ఓట్లతో గెలుపు.

17వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: చంద్రశేఖర్ త్యాడి (తెదేపా - 587 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి శ్రీనివాస్ పండా (303) పై 284 ఓట్లతో గెలుపు.

18వ వార్డు [ఎస్సీ (జనరల్)]: చెరుకుపల్లి నాగార్జున (వైఎస్సార్‌సీపీ - 460 ఓట్లు) సమీప తెదేపా అభ్యర్థి బొబ్బిలి సంతోష్ కుమార్ (439) పై 21 ఓట్లతో గెలుపు.

19వ వార్డు [మహిళ (జనరల్)]: గోలియా లత (తెదేపా - 939 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి రొణంకి శాంతకుమారి (137) పై 802 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు.

20వ వార్డు [బీసీ (జనరల్)]: దువ్వాడ శ్రీకాంత్ (స్వతంత్ర - 395 ఓట్లు) సమీప జనసేన అభ్యర్థి అట్టాడ వాసుదేవ్ (298) పై 97 ఓట్లతో గెలుపు.

21వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: సనపల సింహాచలం (వైఎస్సార్‌సీపీ - 434 ఓట్లు) సమీప తెదేపా అభ్యర్థి పైల దేవకీదేవి (351) పై 83 ఓట్లతో గెలుపు.

22వ వార్డు [మహిళ (జనరల్)]: జోగ కృష్ణ (తెదేపా - 529 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి వజ్జల సౌజన్య (417) పై 112 ఓట్లతో గెలుపు.

23వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: కణితి అశోక్ కుమార్ (తెదేపా - 587 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బమ్మిడి సంతోష్ కుమార్ (507) పై 80 ఓట్లతో గెలుపు.

24వ వార్డు [బీసీ (మహిళ)]: పిట్టా పద్మజ (తెదేపా - 681 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి గురుగుబెల్లి గుణలత (265) పై 416 ఓట్లతో గెలుపు.

25వ వార్డు [బీసీ (మహిళ)]: సప్ప అమ్మోజి (తెదేపా - 552 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి నార్తు మోహిని (352) పై 200 ఓట్లతో గెలుపు.

26వ వార్డు [బీసీ (జనరల్)]: అట్టాడ షణ్ముఖరావు (తెదేపా - 853 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి ఇప్పిలి శంకరరావు (284) పై 569 ఓట్లతో గెలుపు.

27వ వార్డు [బీసీ (జనరల్)]: కృష్ణ నాయకో (తెదేపా - 630 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బెహరా హేమారావు (294) పై 336 ఓట్లతో గెలుపు.

28వ వార్డు [బీసీ (మహిళ)]: బేపాల గీత (తెదేపా - 723 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బోర చంద్రకళ (393) పై 330 ఓట్లతో గెలుపు.

29వ వార్డు [బీసీ (జనరల్)]: టంకాల రవిశంకర్ గుప్తా (తెదేపా - 453 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బోర భగవతీరావు (278) పై 175 ఓట్లతో గెలుపు.

30వ వార్డు [బీసీ (మహిళ)]: సుడియ సుమలత (తెదేపా - 324 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి తుముల సుజాత (211) పై 113 ఓట్లతో గెలుపు.

31వ వార్డు [ఎస్సీ (జనరల్)]: పట్టా మల్లేష్ (తెదేపా - 317 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బోనెలా గణపతి (298) పై 19 ఓట్లతో గెలుపు.

32వ వార్డు [అన్‌-రిజర్వుడ్]: గురిటి సూర్యనారాయణ (తెదేపా - 616 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి కొవ్వూరు తాతారావు (376) పై 240 ఓట్లతో గెలుపు.

33వ వార్డు [మహిళ (జనరల్)]: డొక్కరి తులసి (తెదేపా - 675 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి డొక్కరి యశోధ (324) పై 351 ఓట్లతో గెలుపు.

34వ వార్డు [మహిళ (జనరల్)]: కొవ్వూరు భానుమతి (తెదేపా - 532 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి కొవ్వూరు విజయ (423) పై 109 ఓట్లతో గెలుపు.

35వ వార్డు [మహిళ (జనరల్)]: మార్పు అరుణ (వైఎస్సార్‌సీపీ - 340 ఓట్లు), జోగ త్రివేణి (తెదేపా - 340 ఓట్లు).. లాటరీ ద్వారా మార్పు అరుణ (వైకాపా) గెలుపు.

36వ వార్డు [ఎస్సీ (మహిళ)]: ఉర్నాన సునీత (తెదేపా - 749 ఓట్లు) సమీప వైకాపా అభ్యర్థి బెవర లక్ష్మి (442) పై 307 ఓట్లతో గెలుపు.

పలాస పురపాలక తుది ఫలితాల ముఖచిత్రం:

మొత్తం ఓటర్లు: 49,420
పోలైన మొత్తం ఓట్లు: 34,674 (కౌన్సిలర్ పోల్) / 34,673 (చైర్‌పర్సన్ పోల్)
చెల్లని ఓట్లు (ఇన్‌వాలిడ్): 914 (వార్డు మెంబర్లు) / 964 (చైర్‌పర్సన్)
చెల్లిన ఓట్లు (వ్యాలిడ్): 33,760 (వార్డు మెంబర్లు) / 33,709 (చైర్‌పర్సన్)

వార్డుల్లో పార్టీల బలాబలాలు: కూటమి – 31 (తెదేపా 27 + జనసేన 3 + భాజపా 1), వైఎస్సార్‌సీపీ – 4, స్వతంత్రులు – 1.