BREAKING
అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం

ఫ్రాన్స్, ఇటలీలలో నిరసనలు..భారతీయ పౌరులు, విద్యార్థులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు

Select Suryaa Now
ఫ్రాన్స్, ఇటలీలలో నిరసనలు..భారతీయ పౌరులు, విద్యార్థులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు

సూర్య అంతర్జాతీయ డెస్క్: ఫ్రాన్స్ మరియు ఇటలీ దేశాలలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, నిరసన ప్రదర్శనల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులు, విద్యార్థులను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అప్రమత్తం చేసింది. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు (ఎంబసీలు) మరియు స్థానిక ప్రభుత్వాలు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ఢిల్లీలోని విదేశాంగ శాఖ వారపు విలేకరుల సమావేశంలో అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

ఫ్రాన్స్‌లో పెరిగిన జీవన వ్యయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పారిస్‌లోని భారత ఎంబసీ ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాలు, నిరసన ప్రదర్శనలు జరిగే చోట్లకు దూరంగా ఉండాలని భారత పౌరులను కోరింది. స్థానిక ఆందోళనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొనడం, రవాణా సౌకర్యాలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

మరోవైపు ఇటలీలోని రోమ్, మిలాన్, బోలోగ్నా వంటి ప్రధాన నగరాల్లో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని రోమ్‌లోని భారత ఎంబసీ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సమాయాల్లో ఎంబసీని సంప్రదించాలని, స్థానిక వార్తలను గమనిస్తూ నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. యూరప్‌లోని పరిస్థితులను భారత ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, అక్కడి మన పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.