BREAKING
చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం 33పోస్టల్ బ్యాలెట్లు స్వీకరణ

వరి రైతు వెన్ను విరిచిన మురుసు తుఫాన్!

Select Suryaa Now
వరి రైతు వెన్ను విరిచిన మురుసు తుఫాన్!

                                     వరుస విపత్తులతో కుదేలైన అన్నదాత.. దిక్కుతోచని స్థితిలో రైతులు

రావులపాలెం: మేజర్ న్యూస్ రావులపాలెం మండలం వ్యాప్తంగా మురుసు తుఫాన్ ప్రభావం వరి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది మంతా తుఫాన్ మిగిల్చిన కన్నీళ్లు ఇంకా ఆరకముందే అర్నాబ్ తుఫాన్ వరి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ నష్టాల నుంచి కోలుకోకముందే తాజాగా మురుసు తుఫాన్ మరోసారి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.

మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పొలాలు నీట మునిగి కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వర్షాలు మరింత భారంగా మారాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, చేతికొస్తుందనుకున్న పంట దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

వరుస ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం భారంగా మారిందని, పంటలను కాపాడుకోవాలో.. అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రావులపాలెం మండల వ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.