సుస్థిర జీవనశైలిపై విద్యార్థులకు అవగాహన
కొత్తపేట,మేజర్ న్యూస్ :సుస్థిర జీవనశైలి,పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కొత్తపేట వి.కె.వి.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.పి.రాజు అధ్యక్షతన నిర్వహించారు.బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు,అధ్యాపకులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆహార వ్యవస్థల అనుసరణ,ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ నివారణ,వ్యర్థాల నిర్వహణ,అలాగే కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో కలిగే పర్యావరణ సమస్యలు,వాటి సురక్షిత సేకరణ,వర్గీకరణ,పునర్వినియోగం,శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.ఈ కార్యక్రమంలో బ్రిక్స్ కోఆర్డినేటర్ డా.డి.పీ.హెచ్.పాపారావు,వైస్ ప్రిన్సిపాల్ టీ.రమాదేవి,అధ్యాపకులు బి.విజయకుమార్,ఎమ్.హేమలత,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. డి.పీ.హెచ్. పాపారావు,కె.ఎస్.ఎన్. ప్రసాద్,డి.కావ్య,చి.విజయకుమార్ ఇతర అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.