BREAKING
19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రూ.510 కోట్ల ఆస్తుల అటాచ్ అన్వేషణ గోడపత్రిక ఆవిష్కరణ ఫహద్ ఫాసిల్ తో వివాహ బంధంపై నటి నస్రియా నజీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఈ విషయం ఆయన వింటే అంతే

విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి

Select Suryaa Now
విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి

                                  ప్రైవేటు ఆస్పత్తిలో చికిత్స మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

అంబాజీపేట మేజర్ న్యూస్ :తుఫాను విధ్వంసంలో గ్రామానికి వెలుగు నింపేందుకు అహర్నిశలు శ్రమించిన ఓ విద్యుత్ ఉద్యోగి ఒత్తిడికి గురై ఆస్పత్రి పాలయ్యాడు.వాకలగరువు గ్రామ పంచాయతీ సచివాలయ విద్యుత్ ఉద్యోగి ముత్తాబత్తుల వెంకట్ ఇటీవల వచ్చిన అర్నాబ్ తుఫాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలపై వైర్లు తెగిపడటంతో గత వారం రోజులుగా గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా నిద్ర లేకుండా వర్షంలోనే విధులు నిర్వహించారు. గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు చేసిన కృషిలో తీవ్ర ఒత్తిడికి గురై మంగళవారం బిపి తగ్గిపోవడంతో విధి నిర్వహణలో  కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన ఉద్యోగికి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు,సహచర ఉద్యోగులు అధికారులను కోరుతున్నారు.