19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం
ఇరగవరం సూర్య న్యూస్:జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం నెలకొంది. మండలంలోని కత్తవపాడు ఎంపీటీసీ అభ్యర్థి ఈటకోట వెంకట లక్ష్మీ తెలుగు దేశం పార్టీ తరుపున పోటీచేస్తూ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ,కంతేరు సొసైటీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావులు బలపర్చిన ఎంపీటీసీ అభ్యర్థి ఈటకోట వెంకట లక్ష్మిని గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ,కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎవ్వరు చేయని అభివృద్ధి జరిగిందని దీనిని అందరు గమనించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులలను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మన ఎమ్మెల్యే రాధాకృష్ణ చెందుతుందని చెప్పారు.ఎమ్మెల్యే ఆదేశానుసారం గ్రామభివృద్ధిలో పాలుభాగస్తులైన అభ్యర్థులను మాత్రమే ఎంపికచేసి ఎన్నికలకు సిద్దమైనట్లు చెప్పారు.కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంటా శ్రీను(కేబుల్ శ్రీను)టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.