పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. గత 15 ఏళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్న పలమనేరు మున్సిపాలిటీని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది.మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 26 మంది, వైసీపీ అభ్యర్థులు 8, జనసేన అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించారు. గెలుపొందిన కౌన్సిలర్లకు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన టీడీపీకి చెందిన రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ 3,475 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది.ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ, పలమనేరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.విజయం సాధించిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని పలు వీధుల్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్