అనంతవరం గ్రామంలో కమలం హోరు
- బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి వెంకట్రావు గెలుపు కోసం ప్రచారం
- ఇంటింటా కరపత్రాలతో కూటమి ప్రచార జోరు
- బీజేపీ ఇంచార్జ్ రవికుమార్ సారథ్యంలో ముగిసిన ప్రచారం
పద్మనాభం, సూర్య: పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో కూటమి బలపరిచిన భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సిరిపురపు వెంకట్రావు గెలుపు కోసం కూటమి కార్యకర్తలు భారీ ర్యాలీతో హోరెత్తించారు. అనంతవరం గ్రామంతో పాటు అనంతవరం, గొల్లల పాలెం, ఎస్సీ పేట, సాలిపేట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతూ, కమలం గుర్తుకు ఓటు వేయాలని నినాదాలు చేస్తూ ప్రచార యాత్ర సాగింది. ఈ ప్రచార కార్యక్రమానికి పద్మనాభం మండల బీజేపీ ఇంచార్జ్ రూపాకుల రవికుమార్ సారథ్యం వహించారు.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు మచ్చ సోమేశ్, పాలూరి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి కలగర్ల పేర్రాజు, కడితి ఈశ్వరరావు, చొప్ప కృష్ణ, మరగడ గౌరీ రెడ్డి, రెల్లి సురేష్, బర్ల బాలాజీ, తిరుమలేష్, ఎం.పవన్, జనసేన నాయకులు అర్జున్ రెడ్డి, నిండు వాసు, రిషి గణేష్, బత్తిని దుర్గారావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.గ్రామంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడంతో అనంతవరం ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సిరిపురపు వెంకట్రావు విజయం ఖాయమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.