ప్రత్తిపాడు : కోయవారి పాలెం వద్ద కూలిన చెట్టు.. జేసీబీ తో తొలగించిన ఎస్సై నరహరి
మెరుసు తుఫాను ధాటికి ప్రత్తిపాడు మార్గంలోని కోయవారి పాలెం వద్ద కూలిన చెట్టు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఓ వైపు పొంగిన వాగు,మరోవైపు కూలిన చెట్టు వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.దీంతో అప్రమత్తమైన ప్రత్తిపాడు ఎస్సై నరహరి హుటాహుటిన ప్రాంతానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా స్వయంగా జేసీబీ తో ఎస్సై నరహరి కూలిన చెట్టును తొలగించారు.ట్రాఫిక్ అడ్డంకులు తొలగడంతో వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు.ఎస్సై నరహరి పనితీరుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు..
అనిల్ కాంత్.కె ....గుంటూరు ప్రతినిథి