BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం

Select Suryaa Now
బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం
  • గంటా రవితేజ హాజరుతో హోరెత్తిన బోని సెగ్మెంట్ - దద్దరిల్లిన తెలుగుదేశం నినాదాలు
  • భారీ మెజారిటీతో తాట్రాజు అప్పారావును గెలిపిస్తామని శపథం చేసిన తెలుగు తమ్ముళ్లు

ఆనందపురం, సూర్య:  ఆనందపురం మండలంలో తెలుగుదేశం పార్టీ హవా మరోసారి రుజువైంది. బోని పంచాయతీ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి తాట్రాజు అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ బోని, శిర్లపాలెం, పేకేరు గ్రామాలను షేక్ చేసింది. ఈ భారీ ర్యాలీకి ముఖ్య అతిథిగా యువ నేత గంటా రవితేజ హాజరయ్యారు. ఆయన రాకతో తెలుగు తమ్ముళ్లలో, కార్యకర్తల్లో జోష్ రెట్టింపు అయింది. గంటా రవితేజ ర్యాలీలో కలిసి నడుస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వందలాది బైకులు, ఆటోలు, కార్లతో గ్రామం మొత్తం పసుపు మయమైంది. "జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై గంటా" నినాదాలతో బోని గ్రామం దద్దరిల్లింది. ఆనందపురం మండల టీడీపీ ప్రెసిడెంట్ గా, నిత్యం ప్రజల్లో ఉంటూ చేసిన సేవలతో తాట్రాజు అప్పారావు తిరుగులేని శక్తిగా ఎదిగారని నాయకులు కొనియాడారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగవంశం డైరెక్టర్ సూరాల సత్య వరప్రసాద్ మాట్లాడుతూ - "స్థానిక ఎన్నికల్లో బోని ఎంపీటీసీ సీటు మాదే. బోని, శిర్లపాలెం, పేకేరు గ్రామాలలో తాట్రాజు అప్పారావుకు తిరుగు లేదు. ఆయన రాజకీయ అనుభవం లేని వ్యక్తి కాదు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నేత. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే ఆయనను గెలిపిస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శీర్లపాలెం ప్రెసిడెంట్  కోరాడ గౌరి నాయుడు, శీర్ల అప్పలనాయుడు, కర్రీ శీను, కర్రి వెంకట్రావు వార్డు మెంబర్లు, తెలుగు తమ్ముళ్లు, మహిళా నాయకులు, వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల్లో తాట్రాజు అప్పారావును భారీ మెజారిటీతో గెలిపించుకుని, ఆనందపురం మండల అధ్యక్షుడిగా (ఎంపీపీ) బాధ్యతలు అప్పగిస్తామని శపథం చేశారు. ఆనందపురం మండలంలో తెలుగుదేశం హవా కొనసాగుతోందని, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గంటా రవితేజ నాయకత్వంలో ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంటామని నాయకులు తెలిపారు. బోని గ్రామం నుండి ప్రారంభమైన ర్యాలీ శిర్లపాలెం, పేకేరు మీదుగా సాగి తిరిగి బోని లో ముగిసింది. దారి పొడవునా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.