పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి 3,475 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.మున్సిపాలిటీలో టీడీపీ అత్యధిక వార్డుల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పార్టీ వారీగా ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ 20 వార్డుల్లో, వైఎస్సార్సీపీ 7 వార్డుల్లో, జనసేన పార్టీ 2 వార్డుల్లో విజయం సాధించాయి. మరో 6 వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.ఇక 34వ వార్డులో రీకౌంటింగ్ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటంతో తుది ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 34వ వార్డు రీకౌంటింగ్ అనంతరం పూర్తి ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్