వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం
విజయనగరం, సూర్య : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం పట్టణంలోని పెద్దచెరువు పడమటి భాగం నుండి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ముందు గా వనంగుడిలో వేదపండిసభ ,వేదపండిత, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు,అర్చకులు ,వాద్యబ్రుందాలవారికి ఇఓ కె.శిరీష, ఎంఎల్ సి గాదె శ్రీనివాసులు నాయుడు లు శాలువాలతో సన్మానించి, తాంబూలాది సత్కారాలు చేసారు.తదుపరి అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనం , ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలుజరిపిన అనంతరం పెద్దచెరువు లో మంగళవాయిద్యాలు నడుమ వేదమంత్రాలు సాక్షిగా అమ్మ వారు హంసవాహనంపై నిలిపిన అమ్మవారు ముమ్మారు చెరువులో జలవిహారంచేసారు.విద్యుత్ దీపకాఃతులతో మిరుమిట్లు గొలుపుతూ కన్నులపండువగా తిరుగాడిన అమ్మవారిని ఉత్తర గట్టు నుండి కూడా భక్తులు దర్శనం చేసుకుని పూలు, అక్షతలు చల్లారు.