మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు
నాదెండ్ల న్యూస్ :మురసు తుఫాను పట్ల తీవ్ర గాలి వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన వీధుల వెంట గుంటూరు కర్నూలు రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మండలంలోని సాతులూరు సమీపంలో గుంటూరు - కర్నూలు 167 వ జాతీయ రహదారిపై పునుగుపాడు కాలవ సమీపంలో రోడ్డుపై భారీ చెట్లు గాలికి ఎగిరిపడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా గ్రామానికి సమీపంలో అదే రహదారిపై హోసన్నా మందిరం వద్ద చెట్లు విరిగిపడటంతో మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు స్పందించి జెసిబి ద్వారా పడిపోయిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుముఖం చేశారు. అదేవిధంగా మండలంలో భారీ వర్షానికి ఉదయం 5 గంటల నుంచి అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. గణపవరంలో మండల కేంద్రమైన నాదెండ్ల లో తాసిల్దార్ చంద్రశేఖర్, ఎస్సై కట్ట వెంకటయ్య, గ్రామ రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ చంద్రశేఖర్, ఎస్సై వెంకటయ్య నివాస ప్రాంతాల వారితో మాట్లాడుతూ ఏదైనా పరిస్థితి ఉధృతంగా ఉన్నట్లయితే వెంటనే తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి అన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సాతులూరు గ్రామంలో ప్రధాన వీధులను పరిశీలించారు. ఈ వర్షం కారణంగా గ్రామాల్లో ప్రధాన వీధులు నిర్మానుషంగా మారాయి. గ్రామస్తులు ఎవరు ఇల్ల నుండి బయటకు రాకపోవడంతో ప్రధాన విధులు నిర్మానుషం అయ్యాయి. మంగళవారం రాత్రికి తుఫాను తీరం దాటే సమయంలో గాలి వర్షం వేగంగా వీచే అవకాశం ఉన్నది. ఆందోళన చెందుతున్నారు. సినిమా మెల్ల పాత చర్చి వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అవరోధం ఏర్పడింది.