డీసీపల్లిలో వైసీపీ విస్తృత ప్రచారం
మర్రిపాడు, మేజర్ న్యూస్ : మర్రిపాడు మండలం డిసీపల్లి సెగ్మెంట్లో జరిగిన వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం మంగళవారం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రతి ఇంట్లో ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. జగనన్న సంక్షేమ పాలనను ప్రతి ఇంటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని తెలియజేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు గెలిస్తేనే గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది అని జడ్పీటీసీ అభ్యర్థి సిద్ధంరెడ్డి వెంకటరమణమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి రేవూరు సుప్రజ అన్నారు. ఈ ప్రచారంలో గ్రామస్తులు జడ్పిటిసి అభ్యర్థికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని *"జై జగన్ - జై మేకపాటి " అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ విభాగ వైసిపి నాయకులు అంబటి కృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వర రెడ్డి మరియు డిసిపల్లి, ఖాన్ సాహెబ్ పేట, కోనసముద్రం గ్రామాల వైసిపి నాయకులు పాల్గొన్నారు.