బీఎస్పీ సీనియర్ నాయకుడు నర్సింలు మృతి
కొండాపూర్;బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు తలారి నర్సింలు ఆకస్మికంగా మృతి చెందడం పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది.ఆయన అంత్యక్రియల్లో బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఎం. బాలయ్య, ఈశ్వర్, డి. అశోక్ జిల్లా నాయకులు జార్జ్ డేవిడ్, జనార్దన్ దేవదాస్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా నర్సింలు పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అంత్యక్రియల్లో బీఎస్పీ నాయకులు వెంగల్ దాస్, ప్రభు, అంజిరెడ్డి, బోడ నర్సింలు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.