వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్
వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, నవంబర్ 3:
అన్నమయ్య జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ నుంచి RWS&S అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఆవాసాలకు నిరంతర తాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల (OHSRs) నిర్మాణాలను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని సూచించారు.
ఇంకా ప్రారంభం కాని GLBRలు, OHBRలు, క్లియర్ వాటర్ సంపుల పనులను వెంటనే ప్రారంభించి, నవంబర్ 10లోగా కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో అనుమతుల సమస్యలను పరిష్కరించి పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, DREO కే. శ్రీధర్, RWS&S అధికారులు పాల్గొన్నారు.
సి . శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి