BREAKING
బీఎన్‌పీ పారిబాస్‌లో భారీ మార్పులు మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోకో దిగుబడిలో కోలుకుంటామన్న ఘనా రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల! ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ యెమెన్‌లోని తైజ్ నగరంలో 13 వేల మందికి పైగా గర్భిణుల ప్రాణాలకు ముప్పు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎలినినో ప్రభావంపై రైతులకు అవగాహన

మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Select Suryaa Now
మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

కొండాపూర్;మాదిగ ఉద్యోగుల సమాఖ్ (MEF) సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని 2026–2028 సంవత్సరాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మల్కాపూర్‌లోని ఆదిత్య బ్యాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు.జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు ఉప్పరపల్లి నాగభూషణం మాదిగ అధ్యక్షతన, జిల్లా కో-ఇన్‌చార్జి ఆయుధాల రామచందర్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో సంఘ నిర్మాణం, ఉద్యోగుల ఐక్యత, సమాఖ్య బలోపేతంపై చర్చించారు.MEF జాతీయ ప్రధాన కార్యదర్శి మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెబర్తి యాదగిరి మాదిగ, జాతీయ ఉపాధ్యక్షురాలు బెల్లి శ్యామల మాదిగ సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన జిల్లా కార్యవర్గం గౌరవ అధ్యక్షుడిగా ఎం. శ్రావణ్ కుమార్, అధ్యక్షుడిగా ఎన్. వరాలు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సి.హెచ్. దేవదానం, ప్రధాన కార్యదర్శిగా జి. చంద్రయ్య, కోశాధికారిగా ఎన్. కిష్టయ్య, అదనపు ప్రధాన కార్యదర్శిగా పి. ప్రకాష్ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా బి. రాజు, మోహన్, మధుకర్, ఎ. వెంకయ్య, డి. భారతి; సంయుక్త కార్యదర్శులుగా ఎన్. రాందాస్, డి. పద్మ, జి. మనోహర్; ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎం. సుధాకర్, కె. శంకర్, ఎం. శ్యామ్ రావు, జి. మెరీనా ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుధాకర్, రమేష్ ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం. ఎస్. కృష్ణయ్య, టీజీఎస్పీడీసీఎల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుధాకర్, టిటియు జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం దుర్గయ్యతో పాటు MEF జిల్లా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.