BREAKING
22వ రోజుకు చేరుకున్న ఆరోగ్య మిషను కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె బీఎన్‌పీ పారిబాస్‌లో భారీ మార్పులు మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోకో దిగుబడిలో కోలుకుంటామన్న ఘనా రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల! ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ యెమెన్‌లోని తైజ్ నగరంలో 13 వేల మందికి పైగా గర్భిణుల ప్రాణాలకు ముప్పు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,

కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ *

Select Suryaa Now
కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి  * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ *

చీపురుపల్లి, సూర్య : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చి మూడేళ్లైన ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.  స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో ముదురోడ్ల కూడలి వద్ద మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.  
ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు దోపిడీ పోవాలంటే మార్పు రావాలన్నారు. ధరలు ఆకాశాన్నిఅంటాయని, అందరిమీద దాడులు జరుగుతున్నాయన్నారు.
మళ్ళీ కూటమికి ఓటు వేస్తే నష్టపోతామన్నారు. పరిపాలన ఎక్కడా జరగడం లేదని, పరిపాలన పోలీస్ స్టేషన్లో మాత్రమే జరుగుతుందని ఎద్దేవా చేశారు. పనుల మీద సామాన్యుడు ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీసు స్టేషన్ కి వెళ్తే చేతులు తడపాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు.చంద్రబాబు కళ్ళు తెరవటానికి ఈ ఎన్నికలలో వైసీపీ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు . నిన్న మొన్నటి వరకు తన దగ్గర ఉన్న నాయకులు జెండా మార్చారు. వారి దోపిడీ కి తన దగ్గర అకాశం ఉండదు కాబట్టే పార్టీ మారిపోయారంటూ ఆరోపణచేశారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, చీపురుపల్లి జడ్పీటీసీ అభ్యర్థి బెల్లాన వంశీకృష్ణ, చీపురుపల్లి మాజీ సర్పంచ్ బెల్లాన శ్రీదేవి, మాజీ ఎంపీపి ఇప్పిలి వెంకట నర్సమ్మ, బెల్లాన పావని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.