BREAKING
గ్లోబల్ మార్కెట్లలో భద్రమైన పెట్టుబడుల జోరు విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి ఫిసర్‌వ్‌లో కొత్త సీఈవో నిర్ణయంతో 3,000 మంది ఉద్యోగాలు తొలగింపు అమలాపురం కూటమి కైవసం.. చైర్ పర్సన్ గా నల్లా శ్రీధర్.. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్‌కు ఇంటెసా సన్నాహాలు చిత్తూరులో టీడీపీ జయభేరి: 35,050 ఓట్ల భారీ మెజార్టీతో మేయర్ పీఠం కైవసం పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ 35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!.. రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

22వ రోజుకు చేరుకున్న ఆరోగ్య మిషను కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె

Select Suryaa Now
22వ రోజుకు చేరుకున్న ఆరోగ్య మిషను కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గల ధర్నాచౌక్ లో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. పలువురు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శీర్షాసనమేసి తమ నిరసన వ్యక్తం చేశారు. "ప్రజల ఆరోగ్యం కోసం తలవంచాం, మా హక్కుల కోసం తలకిందులయ్యాం, ఇకనైనా మా గోడు వినండి ప్రభుత్వమా!" అంటూ నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన హక్కులను నెరవేర్చాలని ప్రభుత్వంపై నిరసన తెలిపారు. 22రోజులైనా ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ఎన్ హెచ్ ఎం  ఉద్యోగులతో మాట్లాడి చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వెంకటరమణ, డా.వేణు మాధవ్, డా.రాహుల్,డా. హరీష్ డా.రాజశేఖర్, డా.రవళి, డా.స్వాతి, శోభ, యాదమ్మ, కవిత, నిర్మల, సాయమ్మ,ప్రమీల, రాజు, తదితరులు పాల్గొన్నారు.