BREAKING
బీఎన్‌పీ పారిబాస్‌లో భారీ మార్పులు మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోకో దిగుబడిలో కోలుకుంటామన్న ఘనా రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల! ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ యెమెన్‌లోని తైజ్ నగరంలో 13 వేల మందికి పైగా గర్భిణుల ప్రాణాలకు ముప్పు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎలినినో ప్రభావంపై రైతులకు అవగాహన

విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ

పటాన్ చెరు;చపమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.బీహార్ రాష్ట్రానికి చెందిన వినయ్ కుమార్ (19) స్థానిక పారగాన్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు.ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌తో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ధైర్యం చెప్పారు. కార్మికుడు పనిచేస్తున్న పారగాన్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అలాగే విద్యుత్ శాఖ తరఫున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మృతుడి అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.