ఎంపీపీ రేసులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గాత్రం సౌమ్యశ్రీ
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలో అభ్యర్ధుల ప్రచారం మంగళవారం సాయంత్రం వరకు కోలాహాలంగా సాగింది. టిడిపి తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన గాత్రం సౌమ్యశ్రీ తరుపున టిడిపి జనసేన పార్టీల శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి సౌమ్యశ్రీ కి, జడ్పిటిసి అభ్యర్థి నక్క శ్రీనివాసరావుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. సౌమ్యశ్రీ తండ్రి నారాయణ రావు టిడిపి నాయకులుగా కీలక పాత్ర పోషిస్తున్నారు.2024లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రచారం ముమ్మరం చేశారు. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పూర్తి సహకారం అందిస్తున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధి గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో ముందుకు పోతుంది. రాత్రి నారాయణ తన సొంత ఖర్చులతో భట్టిప్రోలు మెయిన్ రోడ్డులో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచర్ల దాహార్తిని తీర్చేవారు. సందర్భాన్నిబట్టి స్థానిక అన్న క్యాంటీన్లో పలుమార్లు పేదలకు భోజన వసతులు కల్పించారు.ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. గాత్రం నారాయణ తో పాటు గ్రామ టీడీపీ నాయకులు ఓటర్లకు వివరి స్తున్నారు.
ఎంపీపీ రేసులో గాత్రం సౌమ్యశ్రీ.
మండలంలోని 14 ఎంపీటీసీలకు, ఒక జడ్పిటిసికి నవంబర్ ఐదున ఎన్నికలు జరగను న్నాయి. వీటిలో దాదాపు అన్ని ఎంపీటీసీలను తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థుల కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటిలో భట్టిప్రోలు మూడవ సెగ్మెంట్ కు చెందిన విద్యాధికురాలు, కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి అభ్యర్థి గాత్రం సౌమ్యశ్రీ ముందంజలో ఉంది. ఎంపీపీ పదవి బిసి మహిళలకు రిజర్వ్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబు నారాయణ రావు కుమార్తెను ఎంపీపిగా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని మండలంలో చర్చ జరుగుతోంది.