BREAKING
మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికల్లో విజయం సంతోషదాయకం - ఇక ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

Select Suryaa Now
ఎన్నికల్లో విజయం సంతోషదాయకం - ఇక ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలు తమను ఆదరించి ఆశీర్వదించి కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన తమ తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా కు విజయం చేకూర్చడం సంతోషదాయకమని ఆమె కుమారుడు యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. విజయం చేకూర్చేందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. తమన ఆహ్వానించి తెలుగుదేశంలో రప్పించి మున్సిపాలిటీ చైర్మన్ గా పోటీ చేసే అవకాశం కల్పించిన ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. తమ విజయానికి సహకరించిన కూటమి నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడంతో పాటు వారికి సేవలు అందించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, విజయం సాధించామని, ఇక ఆత్మకూరు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా భావించి కుల మతాలు, పార్టీలకతీతంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ప్రజలకు సేవలు అందించడం ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం తన లక్ష్యంగా భావించి అందుకు కృషి చేస్తామని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు.