BREAKING
కళ్యాణలక్ష్మితో ఆర్థిక భరోసా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యo ప్రజాధనంలో ప్రతి రూపాయికి లెక్క ఉండాలి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన డాక్టర్ డూమ్ హవా.. అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ఐదు కొత్త పోస్టర్లు విడుదల! రైతు అభివృద్ధి,సంక్షేమానికి ఏఎంసి లు  పాటుపడాలి. నెల్లూరు కార్పొరేషన్‌లో స్వతంత్రుల సత్తా.. రెండు డివిజన్లలో విజయకేతనం! అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం..పీయూష్ గోయల్ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్ దక్షిణ కొరియాతో ముగిసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌకాదళ విన్యాసాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు–2026: పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి. యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పోశమ్మ తల్లికి బోనం.. ఉద్యోగ భద్రత కోసం వేడుకోలు -22వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె. - ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్

అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం.. టీడీపీ వైపు వైకాపా శ్రేణుల చూపు!

Select Suryaa Now
అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం.. టీడీపీ వైపు వైకాపా శ్రేణుల చూపు!

నందిగాం, సూర్య :  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తుండటంతో  పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నందిగాం మండలం కళ్లాడ పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు, మహిళా కార్యకర్తలు సహా 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి అచ్చెన్నాయుడు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. పల్లెల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పసుపురెడ్డి శ్యామ్‌సుందరరావు, లతమ్మ, తారమ్మ, సుభద్ర, త్రినాధరావు, గౌతమి, భారతి, లక్ష్మి, ఉషారాణి, సుబ్బారావు, చంద్రమ్మ, కనకమ్మ, అరుణకుమారి, భాగ్యలక్ష్మి, భాగవతి తదితరులు పాల్గొన్నారు.