BREAKING
చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం బొంపెల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. - 42 బైక్‌లు, 2 ఆటోలు సీజ్ పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు! పలాస పుర పీఠం టీడీపీ కైవసం! దక్షిణ ఆఫ్రికాలో హింసాకాండ కలకలం చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్.. ఎఫ్ఐఏ ఆసియా-పసిఫిక్ రాలీ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న జీత్ ఝబాఖ్! ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి! రంజీ ట్రోఫీలో చారిత్రక ఘనత.. 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్! వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం

యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు

Select Suryaa Now
యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు
 సూర్య కరీంనగర్ ;శాతవాహన విశ్వవిద్యాలయంలోని కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్–IIIకు చెందిన తొమ్మిది మంది విద్యార్థి వాలంటీర్లు 2026 అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు రెండవ విడతలో భాగంగా నిర్వహించిన ఏడు రోజుల యువ ఆపద మిత్ర శిక్షణా కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా గుడిపేట బెటాలియన్ శిబిరంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో విపత్తుల సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థులు పొందారు. ఈ శిక్షణలో భాగంగా ప్రథమ చికిత్స, ప్రాథమిక జీవనాధార సహాయం, (బిఎల్ఎస్ ), గుండె మరియు శ్వాసక్రియ పునరుద్ధరణ ప్రక్రియ (సిపిఆర్), రక్తస్రావ నియంత్రణ, గాయాల సంరక్షణ, పాము మరియు ఇతర జంతువుల కాట్లకు ప్రాథమిక చికిత్స, అగ్నిప్రమాదాల నివారణ మరియు భద్రత, శోధన, రక్షణ చర్యలు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడం, ఈత, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి అంశాలపై వాలంటీర్లకు సైద్ధాంతిక ప్రాయోగిక శిక్షణ అందించారు.ఈ శిక్షణలో ఎం.కామ్ విద్యార్థులైన కె. నాగరాజు, పి. అభిషేక్, కె. మనీషా, డి. నాగలక్ష్మి, అలాగే ఎం.బి.ఏ విద్యార్థులైన బి. సుమిత్ర, జి. మనోగ్న, బి. లక్ష్మీప్రసన్న, ఎం. రవిచంద్ర, కె. సూర్యప్రకాశ్ పాల్గొని విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు.