మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి
ఆమనగల్లు రంగారెడ్డి:
ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ మాదిగసామాజిక వర్గానికి చెందిన వస్పులజంగయ్యకు కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమనగల్లు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కాసోజు రాముఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి చైర్మన్ పదవి అన్ని సామాజిక వర్గాలకు దక్కిందని కేవలం దళిత వర్గానికి మాత్రమే దక్కలేదని వారు తెలిపారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వస్పుల జంగయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి, అంచెలంచెలుగా ఎదిగి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా పార్టీ కోసం విశేష సేవలందించారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని వీడకుండా అంకితభావంతో పనిచేశారు. కావున పార్టీ పట్ల నిబద్ధత కలిగిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వస్పుల జంగయ్యకు ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లకు కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.