గవర్నర్ కోట లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని పిడమర్తి రవి కి ఇవ్వాలి --- ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన "దళితరత్న" తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్
--గవర్నర్ కోట లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని పిడమర్తి రవి కి ఇవ్వాలి
--- ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన "దళితరత్న" తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):
గవర్నర్ కోట లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కి ఇవ్వాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ దళితరత్న విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం లో తన వంతు పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన భూమిక పోషించిన ఉద్యమకారుడు మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడికి ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు .ఆ పదవిని డాక్టర్ పిడమర్తి రవి కి ఎమ్మెల్సీ ఇస్తే మాదిగలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పున: పరిశీలన చేసి ఈసారి మాదిగలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్డీ నాయకులు మునగలేటి వీరస్వామి మాదిగ బహుజన నాయకులు రాయల శ్రీనివాస్ , మంద కుమార్ మాదిగ రాములు మధు తదితరులు పాల్గొన్నారు