మెగా హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోండి
ఆమనగల్లు రంగారెడ్డి:
పట్టణకేంద్రంలోనిమున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంపు ను మునిసిపల్ సిబ్బంది సద్వినియోగంచేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమునిసిపాలిటీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆప్ ఆమనగల్లు, యశోద హాస్పిటల్ వారి సంయుక్తఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.