నువ్వూరుపాడులో ముమ్మరంగా టిడిపి నేతల ఎన్నికల ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం నువ్వురుపాడు ఎంపీటీసీ పరిధిలో కూటమి ఆధ్వర్యంలో ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ ఖాజావలి తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలో ఆయన ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.నువ్వురుపాడు సెగ్మెంట్ లోని నువ్వురుపాడు, దేపూరు, అశ్వినిపురం,పాత జంగాలపల్లి, ఎస్సీ ఎస్టీ కాలనీలు తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందర్నీ కలిసి ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరుతున్నారు. అందరూ ఖాజావలికి ఘన స్వాగతం పలుకుతూ సన్మానిస్తూ మద్దతిస్తున్నారు.తనకు విజయం చేకూరిస్తే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అండదండలతో నువ్వురుపాడు ఎంపీటీసీ పరిధిలోని అన్ని గ్రామాల్లో, కాలనీల్లో అభివృద్ధి పరుస్తానని, ప్రజా సమస్యల పరిష్కరిస్తానని ఖాజావలి పేర్కొంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.