BREAKING
విశ్వంభరాయ నమః: ప్రకృతిని కాపాడితేనే మనుగడ బంజారాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి -10 కోట్లతో హథిరాం బావాజీ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి - మఠం ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బంజారా నాయకుల వినతి ముంచేసిన మురసు తుఫాన్.. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. దుర్గం చైర్ పర్సన్ గా బుట్నా లక్ష్మి తిమ్మరాజు విజయం. ప్రముఖ లీగల్ సంస్థను నియమించుకున్న మెక్‌డొనాల్డ్స్ బేతంచెర్లలో వైసీపీ జయభేరి మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి నైజీరియా మాజీ గవర్నర్‌కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురు..అవినీతి కేసులో అప్పీలు తిరస్కరణ కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani అరుణాచల్ కివీ పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు..దుబాయ్‌కి తొలి ఎగుమతిని పూర్తిచేసిన అపెడా మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే పశ్చిమాసియా దాడుల్లో 23 మంది భారతీయ పౌరుల మృతి.. విదేశాంగ శాఖ వెల్లడి జోరువానలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి.

మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం

మర్రిపాడు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను, స్థానిక నాయకులను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.  మర్రిపాడు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న కూటమి బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ఆదరించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. ప్రజల ఆశీర్వాదంతో అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత సమర్థవంతంగా కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.