BREAKING
విశ్వంభరాయ నమః: ప్రకృతిని కాపాడితేనే మనుగడ బంజారాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి -10 కోట్లతో హథిరాం బావాజీ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి - మఠం ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బంజారా నాయకుల వినతి ముంచేసిన మురసు తుఫాన్.. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. దుర్గం చైర్ పర్సన్ గా బుట్నా లక్ష్మి తిమ్మరాజు విజయం. ప్రముఖ లీగల్ సంస్థను నియమించుకున్న మెక్‌డొనాల్డ్స్ బేతంచెర్లలో వైసీపీ జయభేరి మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి నైజీరియా మాజీ గవర్నర్‌కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురు..అవినీతి కేసులో అప్పీలు తిరస్కరణ కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani అరుణాచల్ కివీ పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు..దుబాయ్‌కి తొలి ఎగుమతిని పూర్తిచేసిన అపెడా మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే పశ్చిమాసియా దాడుల్లో 23 మంది భారతీయ పౌరుల మృతి.. విదేశాంగ శాఖ వెల్లడి జోరువానలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి.

మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్

Select Suryaa Now
మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్
మాచవరం,  న్యూస్ :పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని మల్లవోలు,  పిల్లుట్ల గ్రామంలోని అరటి, మిరప , బొప్పాయి తోటలను మండల ఉద్యాన అధికారిని ఎం. అంజలి భాయ్  మంగళవారం  పరిశీలించి మురసు తుఫాన్ కారణంగా కురిసే వర్షాలలో ఉద్యాన రైతులకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మాట్లాడుతూ 
తోటలో నిల్వ ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించే ఏర్పాటు చేయాలన్నారు. అరటి లో విరిగిన చెట్లను రెండు పిలకలువదిలికోసివేయ్యాలన్నారు.అరటి బొప్పాయి తోటల్లో గాలికి చెట్లు పడిపోకుండా కర్రలతో ఊతం ఇవ్వాలన్నారు. వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగ నిలబెట్టి మొదలు చుట్టూ మట్టిని ఎగదోయాలన్నారు. అరటి తోటలు నీటి ముంపుతో తోట 2రోజులు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా నీరు తీసి వేసి, తోటలను ఆరెలా చేసి చెట్టు ఒక్కింటికి 100 గ్రా యూరియా, 80గ్రా పోటాష్ ఎరువులను వేసుకోవాలన్నారు.ఉరికెత్తిన మిరప పొలంలో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలన్నారు.మొక్కలు వడబడి తలలు వాల్చినట్లయితే లీటర్ నీటికి ఐదు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ , 19:19:19  5  గ్రాములు కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలన్నారు. పై పాటుగా ఎకరానికి అదనంగా 50 కిలోల యూరియా,25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 200 కిలోల వేప పిండి వేయాలన్నారు. నేల అదునుకు వచ్చిన వెంటనే గొర్రు వేసి అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుందన్నారు. మొక్కలు తేరుకున్న తర్వాత అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాల మిశ్రమం 5  గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలన్నారు.అరటి, బొప్పాయి, మిరప మరియు కూరగాయల తోటల్లో నీరు నిల్వ వుండటం వలన  వేరుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా మాంకోజబ్ లేదా రిడొమిల్ మందు పిచికారి చేసుకోవాలన్నారు . ఈ విదంగా రైతులు వర్షంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు ప్రభాకర్ రెడ్డి, హనుమంతు నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.