విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు
పార్వతీపురం, సూర్య : విద్యార్థులలో దాగివున్న కళాత్మక మరియు సృజనాత్మకత నైపుణ్యాలను వెలికి తీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే జిల్లాస్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీల ప్రధాన లక్ష్యమని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కె రామకృష్ణారావు ,మన్యం జిల్లా సమగ్ర శిక్ష ఏపీసి రాజ్ కుమార్ పేర్కొన్నారు.మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో డివియం ఉన్నత పాఠశాల కళావేదికలో జరిగిన జిల్లా స్థాయి రోడ్ ప్లే ,జానపద నృత్య పోటీలను నిర్వహించారు .ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు .ఈ సందర్భంగా డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కలలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి కనపరచాలని సూచించారు.డిప్యూటీ డిఇఓ మరియు సమగ్ర శిక్ష ఏపీసి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు సృజనాత్మక ఆలోచనలకు ఆత్మవిశ్వాసానికి చక్కని వేదికలుగా నిలుస్తాయని తెలిపారు .జిల్లా స్థాయిలో పోటీలకు ఎంపికైన విద్యార్థులు మరింత పట్టుదలతో సాధన చేసి రాష్ట్రస్థాయిలో రాణించడంతోపాటు జాతీయ స్థాయికి ఎంపికవ్వాలని జిల్లా నోడల్ అధికారి శ్రీ ఎ . శశి భూషణరావు ఆకాంక్షించారు .పోటీలకు జ్యూరీ మెంబర్లుగా డైట్ లెక్చరర్ కే .అన్నారావు, లలిత కుమారి వ్యవహరించారు.జానపద నృత్య పోటీల్లో కేజీబీవీ జోగంపేటకు చెందిన విద్యార్థుల బృందం, రోల్ ప్లే పోటీల్లో డివిఎంఎం పార్వతిపురం కు చెందిన విద్యార్థుల బృందం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులకు నవంబర్లో విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నోడల్ అధికారి శ్రీ ఏ .శశి భూషణరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎమ్ఓ జి.కోటేశ్వరరావు , డివిఎంఎం స్కూల్ హెచ్ఎం శ్రీధర్ , వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు