ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ చక్రం తిప్పారు. ఆయన పన్నిన వ్యూహం అనూహ్యంగా ఫలించింది. బొమ్మిరెడ్డి కుటుంబీకులు తెలుగుదేశం లోకి రప్పించారు. దాంతోపాటు పలువురు ప్రముఖులను కూడా తెలుగుదేశంలోకి రప్పించగలిగారు. దాంతో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆత్మకూరు మున్సిపాలిటీలో విజయ డంకా మ్రోగించారు.రామ నారాయణ రెడ్డి త్రిప్పిన చక్రం అందర్నీ ఆశ్చర్య చకితులను గావించడంతోపాటు ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగా మారింది. రామనారాయణ రెడ్డి అనూహ్యంగా బొమ్మిరెడ్డి వంశంలోని యువనేత బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి, ఆయన తల్లి డాక్టర్ షకీలా, ఆయన సతీమణి డాక్టర్ గీతికాలతో కలిసి రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో ప్రవేశించడంతోపాటు ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం తరఫున రంగంలో దిగారు. రామనారాయణ రెడ్డి అంతటితో ఆగకుండా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సీనియర్ తెలుగుదేశం నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డిని దగ్గరకు రప్పించారు. గత తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత,అభిరాం హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వి శ్రావణ్ కుమార్ రెడ్డి -డాక్టర్ మేకపాటి దీప్తి దంపతులను పార్టీ లేక ఆహ్వానించి తెలుగుదేశం తీర్థం స్వీకరింపజేశారు. దాంతోపాటు వెంకటేశ్వర హాస్పిటల్ ఎండిగా ఉన్న డాక్టర్ జాగర్లమూడి ప్రదీప్- డాక్టర్ హారిక దంపతులను, హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావును తెలుగుదేశం లోకి ఆనం రప్పించారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఇందూరు నరసింహారెడ్డిని పార్టీకి దగ్గరకు చేర్చారు. కేకేఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ డాక్టర్ జి సుధాకర్ రెడ్డి సతీమణి డాక్టర్ అరుణమ్మ కూడా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ షకీలాకు సన్నిహితురాలు అయినందున ఆమె కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె తెలుగుదేశం నాయకురాలు ఆనం కైవల్యా రెడ్డి ముమ్మరంగా డాక్టర్ షకీలా విజయం కోసం మున్సిపాలిటీలోని అన్ని వార్డులు అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ఇంటింటా నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఒక్కసారిగా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేలా ఆనం చక్రం తిప్పారు. దాంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. విజయం సాధించారు.అభివృద్ధిలో అందె వేసిన చేయిగా పేరుగాంచిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనదైన అనుభవ శైలిలో రాజకీయం నడపడంతో మున్సిపల్ చైర్మన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం సాధించారు. దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి 3దపాలు ఎమ్మెల్యే కాగా ఆయన వైద్య సేవలు, ప్రజా సేవలు అందించారు. దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మండలాధ్యక్షుడుగా, సర్పంచ్ గా వైద్య సేవలు, ప్రజా సేవలు అందించారు.డాక్టర్ సుందర రామిరెడ్డి కోడలు, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, బి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలందిస్తున్న ఆమె కుమారుడు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డిలు తెలుగుదేశంలో చేరడం, మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడంతో బొమ్మిరెడ్డి కుటుంబ సేవలు, మంత్రి రామ నారాయణ రెడ్డి చేస్తున్న అనూహ్య అభివృద్ధి వెరసి ఘన విజయం సాధ్యం అయిందని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.