అనూహ్యంగా ఘన విజయం సాధించిన జనసేన శిరీష
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 11వ వార్డులో జనసేన అభ్యర్థి కొలగాని శిరీష అనూహ్యంగా ఘన విజయం సాధించారు. జిల్లా జనసేన సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో కూటమిలో టిక్కెట్ దక్కకపోయినా జనసేన తరఫున అభ్యర్థిగా 11వ వార్డు నుంచి శిరీష పోటీ చేశారు. మంగళవారం వోట్లను లెక్కించగా శిరీష 106 ఓట్ల మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి కొలగాని ప్రశాంతి పై విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి జీ నాగభూషణమ్మకు 135 ఓట్లు మాత్రమే లభించాయి. కొలగాని శిరీషకు 369 ఓట్లు, కొలగాని ప్రశాంతికి 263 ఓట్లు లభించాయి. విజయం సాధించిన శిరీషను జనసేన నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు ఘనంగా అభినందించారు.