నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్
సూర్య కరీంనగర్ ;నగర అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా తమ పాలకవర్గం ముందుకు సాగుతోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నగరంలోని 3, 5వ డివిజన్లలో రూ.1.15 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్లు సాదినేని లావణ్య మునిందర్, గాదె రూప శ్రీనివాస్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో రూ.38 లక్షల సాధారణ నిధులతో, 5వ డివిజన్ సిటిజన్ కాలనీలో రూ.77 లక్షల యూఐడీఎఫ్ నిధులతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 66 డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అమృత్ 2.0 ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్ యార్డు సమస్యకు బయోమైనింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.