telangana
కళ్యాణలక్ష్మితో ఆర్థిక భరోసా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యo
సూర్య గంగాధర ; పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి పథకం ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 30 లక్షల 28 వేల 509 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, తాసిల్దార్ అంబటి రజిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య,మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ,మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు,సత్తు కనకయ్య, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు ముద్దం నగేష్,సర్పంచ్ లు పడాల భాగ్యలక్ష్మి రాజన్న,వేముల భాస్కర్,రామిడి రాజిరెడ్డి,రేండ్ల శ్రీనివాస్,బీర్ల ఆనంద్,ఆరె తేజశ్రీ - రాజశేఖర్,మల్కాపురం రాజేశ్వరి రాజేశం,కడారి రేణుక కనకయ్య,ఈటవేని శ్రీనివాస్,కోలేపాక కవిత మల్లేశం,ధీకొండ బాబలక్ష్మి మధు,దానే అనసూర్య ఓదెలు,గుండవేని లావణ్య తిరుపతి,ఎట్టెపు కనకయ్య,గంకిడి సంధ్య చంద్ర రెడ్డి,కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు,రోమల రమేష్ ,కర్ర బాపు రెడ్డి,రాచమల్ల భాస్కర్,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,బురుగు గంగన్న,అత్తపురం తిరుపతి, గంగాధర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.