మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మురసు తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భట్టిప్రోలు మండలంలోని 11 రెవెన్యూ గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ జి. నాగరాజు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఆశ్రయం పొందే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, భోజన వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. తుఫాను ప్రభావం తగ్గేంత వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలు, ఇతర వస్తువులను తాకరాదని హెచ్చరించారు. పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు సంబంధించిన విఆర్వోలు సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఇలాంటి అవసరం లేదా ఇబ్బంది ఎదురైనా నేరుగా తనకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తాసిల్దార్ కోరారు భట్టిప్రోలు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రాలు:
టి ,ఎం ,రావు హై స్కూల్ భట్టిప్రోలు
కే ఎస్ కే డిగ్రీ కళాశాల, భట్టిప్రోలు
ఎంపీపీ పాఠశాల, గొరిగపూడి
జడ్పీహెచ్ఎస్, ఐలవరం
ఎంపీపీ పాఠశాల, కోనేటిపురం
ఎంపీపీ పాఠశాల ,ఓలేరు
జడ్పీహెచ్ఎస్ ,పల్లి కోన
జడ్.పి.హెచ్.ఎస్ వెల్లటూరు
ఎంపీపీ పాఠశాల ,సూరే పల్లి
జడ్పీహెచ్ఎస్, పెదలంక
ప్రజల భద్రతకు ప్రార్ధన ఇస్తూ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ జి ,నాగరాజు సూచించారు