BREAKING
బీఎన్‌పీ పారిబాస్‌లో భారీ మార్పులు మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోకో దిగుబడిలో కోలుకుంటామన్న ఘనా రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల! ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ యెమెన్‌లోని తైజ్ నగరంలో 13 వేల మందికి పైగా గర్భిణుల ప్రాణాలకు ముప్పు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎలినినో ప్రభావంపై రైతులకు అవగాహన

ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా భారీ నిధులు

Select Suryaa Now
ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా భారీ నిధులు

రాయికోడ్;అందోల్  నియోజకవర్గం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య  పేర్కొన్నారు. నియోజకవర్గంలో రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. మొత్తం రూ.362.45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.ఈ నిధులతో జోగిపేట–అజ్జమర్రి రహదారికి రూ.79 కోట్లు, సంగుపేట బ్రిడ్జి–అన్నసాగర్ రహదారిని నాలుగు లైన్ల విస్తరించేందుకు రూ.20 కోట్లు, తక్కడపల్లి ఎక్స్‌రోడ్డు నుంచి సింగూరు వరకు రెండు లైన్ల  రహదారి నిర్మాణానికి రూ.45 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా వట్టిపల్లి గిరిజన తండా రహదారికి రూ.5 కోట్లు, గార్లపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.17.7 కోట్లు, ముక్తక్యాసరం–మునిపల్లి రెండు లేన్ల రహదారికి రూ.30 కోట్లు, సంగుపేట–పోచారం రెండు లేన్లు రహదారికి రూ.40 కోట్లు, నర్సింగి–శంకరంపేట రెండు లైన్ల రహదారికి రూ.30 కోట్లు, తాటిపల్లి–ముక్తక్యాసరం  రహదారికి రూ.22 కోట్లు, సింగితం–కోడూరు రెండు లేన్ల రహదారికి రూ.20 కోట్లు కేటాయించినట్లు వివరించారు.మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా జోగిపేట ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.20 కోట్లు, ఎన్‌ఏసీ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు, ఆర్డీఓ కార్యాలయం భవనానికి రూ.5.75 కోట్లు, వట్టిపల్లి నాలుగు లైన్ల రహదారికి రూ.3.5 కోట్లు, కుస్నూర్  బ్రిడ్జి నిర్మాణానికి రూ.5.5 కోట్లు కేటాయించినట్లు ప్రచార చిత్రంలో పేర్కొన్నారు.నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ప్రధాన రహదారులను విస్తరించడం, వంతెనల నిర్మాణం ద్వారా ప్రజల ప్రయాణ కష్టాలను తొలగించడం, ప్రభుత్వ కార్యాలయాలకు ఆధునిక భవనాలు నిర్మించడం వంటి లక్ష్యాలతో ఈ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే ఆందోల్ నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.నియోజకవర్గ  అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య