మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం!
నెల్లూరు, అర్బన్, క్రైమ్,మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండా గీతిక ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 2,545 ఓట్ల భారీ మెజార్టీతో విజయం కైవసం చేసుకుని డివిజన్‌లో టీడీపీ సత్తా చాటారు.మంత్రి పొంగూరు నారాయణ ఆశీస్సులతో పాటు, డివిజన్ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ సహకారం, పార్టీ శ్రేణుల సమష్టి కృషి ఈ విజయానికి తోడ్పడ్డాయి.ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కొండా గీతిక విజయానికి కృషి చేశారు. ఓటర్లు ఆమెకు భారీ మెజార్టీ కట్టబెట్టడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. 11వ డివిజన్ ప్రజలు అందించిన ఈ విజయాన్ని తనపై ఉంచిన బాధ్యతగా భావిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.మంత్రి పొంగూరు నారాయణ ఆశీస్సులు, డివిజన్ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ సహకారం, కార్యకర్తల కృషి వెరసి కొండా గీతికకు ఘనవిజయాన్ని అందించాయని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో సాధించిన ఈ విజయం 11వ డివిజన్‌లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.