కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన
కడప మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రంలో తీవ్ర తర్జనభర్జన నెలకొంది. ఉదయం నుంచి ఇప్పటివరకు కేవలం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను మాత్రమే అధికారులు వెల్లడించారు. సుమారు 8 గంటల సుదీర్ఘ సమయంలో కేవలం 436 పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే లెక్కించగలిగారు. లెక్కింపు ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతుండటంతో ఇప్పటివరకు ఒక్క వార్డుకు సంబంధించిన ఫలితం కూడా వెలువడలేదు.
ఈ తీవ్ర విలంబనానికి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది మధ్య కొరవడిన సమన్వయ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. లెక్కింపు సమయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండటంతో లెక్కింపు ప్రక్రియ నిలిచిపోతూ, ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతోంది.