సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక
సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన రీతిలో ఒక నకిలీ డొమైన్‌ను సృష్టించినట్లు గురించిన కోర్టు రిజిస్ట్రీ తీవ్రంగా స్పందిస్తూ ప్రజలకు పబ్లిక్ నోటీసు జారీ చేసింది. సైబర్ మోసగాళ్ల నివేదికల నేపథ్యంలో ప్రజలు తమ వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఈ నకిలీ వెబ్‌సైట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని తీవ్రంగా హెచ్చరించింది.
తాజాగా 'scigovinjudicial.com' అనే నకిలీ వెబ్‌సైట్ చలామణిలో ఉన్నట్లు రిజిస్ట్రీ గుర్తించిందని నివేదికలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ కేవలం 'sci.gov.in' మాత్రమేనని సుప్రీంకోర్టు యాజమాన్యం స్పష్టం చేసింది. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏదైనా వివరాలు ఇచ్చే ముందే వెబ్‌సైట్ ప్రామాణికతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రజలకు సూచించింది. గతంలో కూడా ఇలాంటి మోసపూరిత వెబ్‌సైట్లపై అత్యున్నత నాయస్థానం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.