ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని కృతి భవన్ ప్రాంగణంలో ఉన్న సుమారు వందేళ్ల నాటి ఖదీమీ మసీదును తొలగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తుల లౌకిక స్వభావానికి మతపరమైన కట్టడాలు విరుద్ధమని తమ వాదన సందర్భంగా కేంద్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడంలో భాగంగా ఈ మసీదును తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని నివేదికలో పేర్కొంది. అలాగే, ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయంగా దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న షాహీ మసీదును ఉపయోగించుకోవచ్చని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.