BREAKING
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ రాయికోడ్ జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం దీపావళి కానుకగా 'మూకుతి అమ్మన్ 2' విడుదల.. చెన్నై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నటి నయనతార! పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం ఖజానా ఖాళీ.. పంచాయతీల్లో పాలన కుదేలు! అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ కృష్ణ ప్రత్యేక చొరవ అవోపా శాశ్వత నిధి కింద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ చొరవతో గ్రామస్తులకు ఊరట బీఎస్పీ సీనియర్ నాయకుడు నర్సింలు మృతి మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ * ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎంపీపీ రేసులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గాత్రం సౌమ్యశ్రీ బరువు తగ్గేందుకు మందులు వాడానంటూ వస్తున్న వదంతులపై స్పందించిన నటి అమృత అరోరా.. అసలు విషయం బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ!

ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం

Select Suryaa Now
ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2026 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది మొత్తం 19715 ఓట్లుకు గాను కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా చైర్పర్సన్ గా పోటీ చేసిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా కు 10,581 ఓట్లు రాగా తమ ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతికి 8375 ఓట్లు లభించాయి. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థికి 73 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా 112 ఓట్లు రాగా 460 ఓట్లు చెల్లుబాటుకాలేదు. 114 మంది నోటాకు ఓటు వేశారు. డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2026 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు స్థానిక బి ఎస్ ఆర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ షకీలా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో ఆమె మరియు ఆమె కుమారుడు, యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి తెలుగుదేశంలో చేరి మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ షకీలా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా పదో వార్డు ఏకగ్రీవంగా తెలుగుదేశం అభ్యర్థి కృష్ణవేణి ఎన్నికయ్యారు.పోలింగ్ జరిగిన 27 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు 11 మంది విజయం సాధించగా జనసేన తరపున ముగ్గురు, జనసేన ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు, బిజెపి అభ్యర్థి ఒకరు విజయం సాధించగా పదిమంది వైసీపీ అభ్యర్థులు, ఒక సిపిఎం అభ్యర్థి విజయం సాధించారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగ్గా ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అధికారులు డాక్టర్ షకీలా విజయం పొందినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని ఆమె తనయుడు యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డికి అందజేశారు.