BREAKING
శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం!

కోనాడలో తెదేపా రెబల్ అభ్యర్థి సత్తిబాబు గెలుపు పై ధీమా

Select Suryaa Now
కోనాడలో తెదేపా రెబల్ అభ్యర్థి సత్తిబాబు గెలుపు పై ధీమా

పూసపాటిరేగ, సూర్య : తెదేపాకు కంచు కోట అయిన కోనాడలో ఎంపీటీసీ ప్రచార హోరులో తెదేపా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైలపల్లి సత్తిబాబు ముందంజలో ఉంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెదేపా పార్టీ తరఫున బీ ఫారం రాకపోవడంతో వైకాపా అభ్యర్థిపై సత్తిబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత రెండుసార్లు ఎంపీటీసీగా పనిచేసిన లక్ష్మారెడ్డి అభివృద్ధి చేయడంలో వెనుక బడి ఉండడంతో అదే ప్రచారస్థరాన్ని సంధించి సత్తిబాబు ఓటర్లను తనదైన శైలిలో ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తున్నారు. సత్తిబాబుకు తెదేపా సీనియర్ నాయకుడు, రాష్ట్ర మత్స్య కార నాయకుడు అండదండలు కూడా ఉండడంతో గెలుపు పై సత్తిబాబు భీమాను వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు కూటమి తరుపున అటు తెదేపా గాని, జనసేన పార్టీ తరపున గుర్తులు లేకపోవడంతో తనకు కేటాయించిన గుర్తును ప్రజలకు వివరిస్తూనే ఓట్లను అర్ధించే విధంగా సత్తిబాబు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చివరి రోజు అయిన మంగళవారం ప్రచారానికి చివరి గడువు అయినప్పటికీ భారీ ర్యాలీగా జనసేన జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల రేవతి తో కలిసి సత్తిబాబు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడంతో విజయం తననే వరిస్తుందన్న ధీమాను సత్తిబాబు వ్యక్తం చేస్తున్నారు.