కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్.
కావలి, మేజర్ న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా, ముసురు తుఫానుగా మారి ఒంగోలు వద్ద తీరం దాటుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రైల్వే అధికారులు కావలి రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లను నిలిపివేశారు. రైళ్లు నిలిచిపోవడంతో స్టేషన్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారనే సమాచారం తెలుసుకున్న రోటరీ క్లబ్ ప్రతినిధి పేరూరు శంకర్ నారాయణ బృందం వెంటనే స్పందించింది. వారు ప్రయాణికులకు చల్లని మజ్జిగ, తాగునీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. విపత్తు సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి ఆకలి, దప్పికలతో అల్లాడుతున్న తమకు అండగా నిలిచిన రోటరీ క్లబ్ సభ్యుల ఉదారతను ప్రయాణికులు ముక్తకంఠంతో కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.