BREAKING
అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్ కృత్రిమ మేధస్సు రేసులో దిగ్గజ సంస్థలకు భారం.. ఆపిల్‌పై పడుతున్న వ్యయాల సెగ

ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే!

Select Suryaa Now
ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే!

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :    ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలోనూ తమ రాజకీయ గురువును మరువకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు చిన్న మస్తాన్, ఆయన సతీమణి అభిబున్నిస్సా. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్న మస్తాన్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాబీర్ ఖాన్ సతీమణి గౌసియా బేగంపై 570 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల బరిలో ప్రత్యర్థిగా నిలిచినప్పటికీ, తన రాజకీయ ప్రయాణంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చిన్న మస్తాన్ దంపతులు తమ విజయాన్ని ఎమ్మెల్యేకు అంకితం చేస్తూ, “ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే.. గెలిచినా, ఓడినా మీ వెంటే ఉంటాం” అన్న భావనను వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తమ అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని చాటిచెప్పారు.