BREAKING
రంజీ ట్రోఫీలో చారిత్రక ఘనత.. 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్! వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్!

డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం!

Select Suryaa Now
డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం!

సదాశివపేట;ఎంకేపల్లి డంప్ యార్డ్ నిర్వహణలో నెలకొన్న లోపాలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. అధికారులు, ఎంకేపల్లి గ్రామస్థులతో కలిసి డంప్ యార్డ్‌ను సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, దీపావళి పండుగలోపు సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో డంప్ యార్డ్‌లో వేయాల్సిన చెత్త రోడ్లపై పేరుకుపోతోందని, దీంతో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్థులు తీసుకువచ్చారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై పందులు, పశువుల సంచారం పెరిగిందని, వీధి కుక్కల కారణంగా విద్యార్థులు, మహిళలు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. చెత్తను రోడ్లపై వేయకుండా డంప్ యార్డ్‌లోనే నిల్వ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.అలాగే వర్షపు నీటితో చెత్తలోని వ్యర్థాలు కలిసి సమీపంలోని రెండు చెరువులు కలుషితమవుతున్నాయని, దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు చెరువులు గంగకత్వ కాలువకు సంబంధించిన టెయిల్ ఎండ్ పాండ్స్ కావడంతో కలుషిత జలాలు చెరువుల్లోకి చేరకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.ఇదే సమయంలో ఎంకేపల్లి చౌరస్తాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంకేపల్లి గ్రామ యువత, మాజీ సర్పంచులు రాములు, శేఖర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, కోడూరి రమేష్, మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు తదితర మండల నాయకులు పాల్గొన్నారు.