BREAKING
మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు!

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి - న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోయిర్కర్

Select Suryaa Now
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి - న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోయిర్కర్

 

సూర్య - పెద్దపల్లి రూరల్ 03: యువత మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోయిర్కర్ సూచించారు. మండలంలోని చీకురాయి గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ, వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి భద్రతకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, వార్డు సభ్యులు, న్యాయవాదులు నరేష్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.